వికారాబాద్ జిల్లా పరిగిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 400 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 8 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, డబుల్ లైన్, ఫోర్ లైన్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని, సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. కరెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు.