TG:
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. 30 శాతం కమిషన్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. “ఈ మాట నేను చెప్పలేదు.. ప్రజలే చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్లు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతోందని రాష్ట్రమే కోడై కూస్తోంది” అని హరీశ్‌రావు అన్నారు.