TG: రాష్ట్రంలో అప్పుల లెక్కల చుట్టూ
రాజకీయాలు వేడెక్కాయి. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పుల చర్చల విషయంలో
కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిపోయిందని ఎద్దేవా చేశారు. 'సై' సినిమాలోని హాస్యనటుడి క్యారెక్టర్‌తో రేవంత్ రెడ్డిని పోల్చుతూ, చర్చకు సవాల్ చేసి వెనక్కి తగ్గారని విమర్శించారు.
కేటీఆర్, హరీష్ రావుల దెబ్బకు
కాంగ్రెస్ మంత్రులు ఖతమయ్యారని, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని అన్నారు.