స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చిచ్చు

19154చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చిచ్చు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై అసంతృప్తి రాజుకుంది.  నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారట. అలాగే కొండా సురేఖ వర్గం కూడా డీసీసీ అధ్యక్ష నియామకంపై అసహనంతో ఉన్నట్లు సమాచారం. దీంతో పంచాయతీ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడం రేవంత్ రెడ్డికి సవాలుగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి