ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల సంఘం తీరుపై
కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా నుంచి 5.43 కోట్ల మంది పేర్లను తొలగించడంపై పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం చర్యలు వైఫల్యమని, ప్రజలు ఓటు హక్కు కోల్పోతున్నారని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేష్ కుమార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.