తెలంగాణ కథలో నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌: కేటీఆర్‌

12చూసినవారు
తెలంగాణ కథలో నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. ఆనాడు బలవంతంగా తెలంగాణ, ఆంధ్రాను కలిపింది, తెలంగాణ ఉద్యమాలను కర్కశంగా అణచివేసింది హస్తం పార్టీనేనని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ, ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్‌ అని అన్నారు. తమకు కూడా కేసీఆర్‌ లాంటి పాలకుడు కావాలని ఇతర రాష్ట్రాలవారు అనుకునేలా పదేళ్ల పాలన సాగిందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్