సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు: KTR

TG: రాష్ట్రంలో ఆత్మగౌరవ ఇళ్లు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటన్నారు. 20 లక్షల ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామంటున్నారని, సవాల్ విసిరిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. శపథం చేయడం కాదు, చేతనైతే చేసి చూపించాలన్నారు. తాము కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమని, తాము ఇళ్లు కట్టిస్తే.. కాంగ్రెస్ వాళ్లు కూల్చుతున్నారని విమర్శించారు.
