
కాన్వాలో భారీ ఉద్యోగ కోత.. 22 శాతం సిబ్బంది తొలగింపు
ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా (Canva) బుధవారం తన చరిత్రలోనే అతిపెద్ద లే-ఆఫ్స్ను ప్రకటించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం సిబ్బందిలో 22 శాతం మందిని, అంటే 1,271 మందిని తొలగిస్తున్నట్లు సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ మెలానీ పెర్కిన్స్ వెల్లడించారు. 13 ఏళ్ల సంస్థ ప్రస్థానంలో ఇదే అత్యంత కఠిన నిర్ణయమని పేర్కొంటూ ఆమె క్షమాపణలు కోరారు. ప్రభావిత ఉద్యోగులకు 6 నెలల వేతనం, ఆరోగ్య బీమా, కెరీర్ సపోర్ట్ వంటి భారీ ప్యాకేజీని కంపెనీ ప్రకటించింది.




