TG: జనగామలో శనివారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి చెప్పులు వేసేందుకు యత్నించారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.