గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరిగిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్ అంశంపై మాట్లాడారు. పటేల్ దేశ ఐక్యత కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించారని మోదీ కొనియాడారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించిందని ఆరోపించారు. నెహ్రూ, పటేల్ అభిప్రాయాలను గౌరవించలేదని, కాంగ్రెస్ ఆయన దూరదృష్టిని మరచిపోయిందని మోదీ విమర్శించారు.