కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా ఆస్తుల చుట్టూ తిరుగుతున్నారు: జగదీశ్ రెడ్డి

7చూసినవారు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాము ఎండిపోయిన పొలాల చుట్టూ, రైతుల చుట్టూ తిరుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపక్ష నేతల ఆస్తుల చుట్టూ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో ఎండిపోయిన పొలాలను పరిశీలించిన జగదీష్ రెడ్డి ఆయా రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను ఆయనకు తెలిపారు. తమకు కరెంటు, నీళ్లు కావాలంటూ రైతులు తమ బాధను చెప్పుకున్నారు. తమ హయాంలో ఇలాంటి సమస్యలు రానివ్వలేదని MLA తెలిపారు.

సంబంధిత పోస్ట్