ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తోంది: టీపీసీసీ చీఫ్

7చూసినవారు
ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తోంది: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ పార్టీ ప్రతిభావంతులైన యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి 'టాలెంట్ హంట్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం ద్వారా పార్టీలకు అతీతంగా, కేవలం ప్రతిభ, సమాజ సేవ చేయాలనే దృక్పథం ఉన్న యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనతో పాటు, కాంగ్రెస్ సిద్ధాంతమైన లౌకికవాదంపై పట్టున్న వారిని గుర్తించి, అధికార ప్రతినిధులుగా నియమిస్తామని, ఇది యువతకు గొప్ప వేదిక అవుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్