కాంగ్రెస్ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. పార్టీ నేతలు ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నారు. దీనిపై ఈనెల 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈసీ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలంటూ వార్తలు వచ్చాయి. 10 నెలల్లో 14 ఏకపక్ష నిర్ణయాలంటూ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అభిశంసనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.