TG: కాగ్రేస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న సిరిసిల్లలో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ నాయకుల బృందం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సేకరించిన అంశాలపై సీఎం రేవంత్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత సిద్ధిపేటలోనూ మరో సభను నిర్వహించనుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.