TG: బీఆర్ఎస్ కీలక నేతలు KTR, హరీశ్ రావు కంచుకోటల్లో
కాంగ్రెస్ సమరానికి సిద్ధమవుతోంది. ఈ నేతలిద్దరిని లక్ష్యంగా చేసుకుని సిద్దిపేట, సిరిసిల్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు టీపీసీసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ నెల 30న సిరిసిల్లలో, OCT మొదటి వారంలో సిద్దిపేటలో సభకు ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే సిరిసిల్ల, సిద్దిపేటలో
కాంగ్రెస్ బహిరంగ సభల నిర్వహణపై CM రేవంత్ గతంలోనే సంకేతాలిచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో
కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సవాల్ చేశారు. ప్రస్తుతం BRS నేతల భూముల పరిశీలన పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేట సభలు ఆసక్తిని రేపుతున్నాయి.