TG: ఎన్నికల్లో
కాంగ్రెస్ గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరోలా ఎన్నికల సంఘంపై మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసం కొనసాగించాలని సూచించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై
కాంగ్రెస్ సమాధానం చెప్పాలని, ఓటరు జాబితాల సవరణపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని, ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.