కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపై టీవీకేతో కలిసి నడవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డీఎంకేకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. మతతత్వ శక్తులను కూటమికి దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.