పాడి కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటుకు కాంగ్రెస్ వ్యూహం!

2847చూసినవారు
పాడి కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటుకు కాంగ్రెస్ వ్యూహం!
TG: బీఆర్ఎస్ MLA పాడి కౌశిక్‌రెడ్డిపై అసెంబ్లీ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై కాంగ్రెస్ అనర్హత వేటు వేయించే యోచనలో ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రసంగాన్ని అడ్డుకుని, దుర్భాషలాడారని, కాల్చేస్తానని బెదిరించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి చేరింది. అయితే దానం నాగేందర్‌పై కోర్టులు వేటు వేసిన నేపథ్యంలో, పాడిపై అనర్హత వేటు పడితే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నాయకులు దీనిని కక్షపూరిత చర్యగా ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం సభను అగౌరవపరిచిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.

సంబంధిత పోస్ట్