
VIDEO: ఆసియా క్రీడలు.. రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం
ఆసియా క్రీడల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్.. ఉత్తర కొరియాకు చెందిన హాన్ చోంగ్ సాంగ్‌ను 11-7 తేడాతో ఓడించి విజయం సాధించారు. ఈ పతకంతో ఆసియా క్రీడలు-2026లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 83కు చేరగా, స్వర్ణాల సంఖ్య 20కి చేరుకుంది.




