తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: టీపీసీసీ చీఫ్

4చూసినవారు
TG: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి పదవీ భవిష్యత్తుకు పునాది వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రైతులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దేశంలో తొలిసారి కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని కొనియాడారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, దళిత బంధు పేరిట గత ప్రభుత్వమే దళితులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్