నెల్లికుదురు మండలంలో కాంగ్రెస్ ఘన విజయం

177చూసినవారు
నెల్లికుదురు మండలంలో కాంగ్రెస్ ఘన విజయం
TG: మహబూబాబాద్ (D) నెల్లికుదురు (M) కాచికల్ గ్రామంలో సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జిల్లాలో కాచికల్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా నిలుస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ ఓడింది. గురువారం జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 541 ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇట్టే లీలమ్మ దేవేందర్ గెలిచి ఆ రికార్డ్‌ను కొనసాగించారు.
Job Suitcase

Jobs near you