మున్సిపల్ ఎన్నికలు.. టికెట్ దక్కలేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

65చూసినవారు
మున్సిపల్ ఎన్నికలు.. టికెట్ దక్కలేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో అంతా సవ్యంగా ఉందని ప్రకటించిన 24 గంటల్లోనే చండూరు మున్సిపాలిటీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ (బీ-ఫామ్) దక్కలేదన్న మనస్థాపంతో వేణు అనే కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేణు చండూరు మున్సిపాలిటీలోని 9వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నాడు, కానీ బీ-ఫామ్ దక్కకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్