తులం బంగారం హామీ అమలుపై కాంగ్రెస్ కసరత్తు.. ధరల పెరుగుదలతో జాప్యం

23చూసినవారు
తులం బంగారం హామీ అమలుపై కాంగ్రెస్ కసరత్తు.. ధరల పెరుగుదలతో జాప్యం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 'తులం బంగారం' హామీ అమలుపై కసరత్తు చేస్తోంది. 2023 ఎన్నికల నాటికి, 2026 నాటికి బంగారం ధర దాదాపు రెట్టింపు అయింది. అప్పట్లో తులం బంగారం సుమారు రూ.50,000 - రూ.60,000 ఉండగా.. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,000కి చేరింది. రాష్ట్ర ఆదాయం తగ్గడం, బంగారం ధరలు పెరగడం వల్ల పథకం అమలులో జాప్యం జరుగుతోందని మంత్రులు తెలిపారు. ఈ పథకం కింద వివాహం చేసుకునే ఆడబిడ్డలకు రూ.1 లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్