కరెంట్‌ బిల్‌ కట్టకపోతే కనెక్షన్‌ కట్‌.. SPDCL ఆదేశాలు!

42చూసినవారు
కరెంట్‌ బిల్‌ కట్టకపోతే కనెక్షన్‌ కట్‌.. SPDCL ఆదేశాలు!
TG: గడువులోగా విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులకు సరఫరా నిలిపివేయాలని ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరెంట్ మీటర్ రీడర్లకు లక్ష్యాలు నిర్దేశించి, ఈ బాధ్యతలను అప్పగించారు. నెలలో 10 రోజులు మాత్రమే పనిచేసే మీటర్ రీడర్లు, మిగిలిన రోజుల్లో కూడా పనిచేయాలని సూచించారు. టీజీఎస్‌పీడీసీఎల్‌లో సుమారు 1500 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. ప్రతి రీడర్ నెలకు వంద కనెక్షన్లను తనిఖీ చేసి, బిల్లు చెల్లించని వారి విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్