
ఆకలితో అల్లాడుతున్న ఉగాండా.. పురుగులు తింటున్న చిన్నారులు
ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. కరమోజా సబ్ రీజన్లో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, ఆకలితో అల్లాడిపోతున్నారు. ప్రాణాలు నిలుపుకోవడానికి మట్టి, గడ్డితో పాటు బతికున్న పురుగులను సైతం తింటున్నారు. ఇద్దరు చిన్నారులు బతికున్న పురుగులను తింటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ పురుగుల్లో మాంసం కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ దారుణ పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.




