తురకపాలెంలో 2021 నుంచి వరుస మరణాలు

12157చూసినవారు
తురకపాలెంలో 2021 నుంచి వరుస మరణాలు
AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలో 2021 నుంచి అసాధారణ మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటివరకు 89 మంది మరణించారు. 2021లో 19 మంది మరణించారు. 2022లో 26 మంది, 2023లో 18 మంది, 2024లో 16 మంది చనిపోయారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో 10 మంది మరణించారు. ఐదేళ్లుగా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు.