డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే గాంధీ కుటుంబంపై కుట్ర: మంత్రి పొన్నం ప్రభాకర్

39చూసినవారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటులో చర్చించకుండా తప్పించుకోవడానికి, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం ఉందని, భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే గాంధీ కుటుంబంపై కుట్ర అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్