ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్‌రావును ఇరికించే కుట్ర: బీఆర్ఎస్

7500చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్‌రావును ఇరికించే కుట్ర: బీఆర్ఎస్
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరికించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 2024 మార్చిలో నమోదైన కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేయలేదని, రాజకీయ కక్షతోనే రెండుసార్లు సిట్ ఏర్పాటు చేశారని విమర్శించారు. సాంకేతిక ఆధారాలతో విచారణ జరపాల్సిన కేసులో పాత నేరస్థులతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేసి తప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్