నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర!

45559చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర!
AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కోటంరెడ్డి హత్యకు ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కుట్ర వెనుక రౌడీషీటర్లు శ్రీకాంత్, జగదీష్ ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. హత్యపై రౌడీషీటర్లు చర్చించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్