
70 ఏళ్ల వృద్ధ దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం
దేశ రాజధాని ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో గురువారం రాత్రి 70 ఏళ్ల అంధ, మానసిక దివ్యాంగురాలిపై ఒక వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై ఇటుకతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల పెరుగుతున్న హింసాత్మక ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.




