విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే కుట్ర: జగదీశ్ రెడ్డి

7చూసినవారు
TG: విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని మాజీమంత్రి, MLA జగదీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'లాభాల్లో నడుస్తున్న ట్రాన్స్‌కోని రేవంత్ రెడ్డి తన దోస్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారు. నష్టాల్లో లేని ట్రాన్స్‌కోని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఈ దేశంలో ఇప్పటివరకు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన చోట ఎక్కడ కూడా మంచి ఫలితాలు లేవు. ప్రైవేట్ వాళ్లు లాభాల కోసం చూస్తారు తప్పా.. ప్రజల కోసం ఆలోచించరు. దీన్ని BRS తీవ్రంగా వ్యతిరేకిస్తోంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్