TG: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుని, ఆ దిశగా పని చేయాలన్నారు. కానీ మహాత్మా గాంధీని ప్రజలు మరచిపోవాలన్న ఉద్దేశంతో ఆ పథకం పేరును మార్చాలని కుట్ర చేస్తోందని చామల నిరసన వ్యక్తం చేశారు.