గణేష్ నిమజ్జన ఊరేగింపులో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

36చూసినవారు
గణేష్ నిమజ్జన ఊరేగింపులో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి
TG: వికారాబాద్ జిల్లా పరిగిలో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న తరుణ్ అనే యువకుడు వీరంగం సృష్టించి, ఓ ట్రాక్టర్ తాళం చెవిని లాక్కున్నాడు. దీంతో అక్కడ గొడవ జరుగుతుండగా.. దానిని ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేయడంతో ఆయన ఎడమ కడుపు భాగంలో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్