'అందరికీ సారీ.. మా అమ్మను, చెల్లిని ఏం అనొద్దు' అంటూ కానిస్టేబుల్ సూసైడ్

0చూసినవారు
'అందరికీ సారీ.. మా అమ్మను, చెల్లిని ఏం అనొద్దు' అంటూ కానిస్టేబుల్ సూసైడ్
TG: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం కానిస్టేబుల్ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయలు వెలుగు చూస్తున్నాయి. సందీప్ చనిపోయే ముందు తన బంధువులు, స్నేహితులను కలిపి "సందీప్ వెల్విషర్" పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అందులో 'సారీ ఆల్.. మా అమ్మని, చెల్లిని ఎవరూ ఏమీ అనకండి ప్లీజ్, నేను ఉన్నన్ని రోజులు వాళ్లకు నరకం చూపించాను. సారీ అమ్మా.. చెల్లి' అని పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్