అప్పులు తీర్చేందుకు వ్యాపారిని చంపిన కానిస్టేబుల్‌ దంపతులు

0చూసినవారు
అప్పులు తీర్చేందుకు వ్యాపారిని చంపిన కానిస్టేబుల్‌ దంపతులు
TG: సిద్దిపేట జిల్లాలో కానిస్టేబుల్‌ గౌటి ప్రవీణ్‌కుమార్‌, అతని భార్య రజిత అప్పులు తీర్చేందుకు ఓ వ్యాపారిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసైన ఈ దంపతులు రూ.30 లక్షల అప్పుల్లో కూరుకుపోయి, వాటిని తీర్చేందుకు స్థిరాస్తి వ్యాపారి బెల్దె విశ్వనాథం(57)ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్లాటు చూపిస్తామని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కారులోనే అతన్ని హత్య చేశారు. అతని వద్దఉన్న 10 తులాల బంగారు నగలను దోచుకుని మృతదేహాన్ని కాలువలో పడేశారు. అనంతరం హైదరాబాద్‌లో నగలను విక్రయించి డబ్బు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్