నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్‌ను పోలీసులు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం కత్తితో పొడిచి పరారైన నిందితుడిని నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో డ్రోన్‌ల సహాయంతో పట్టుకున్నారు. మరో వ్యక్తితో జరిగిన గొడవలో గాయపడిన రియాజ్‌కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితడు ఎన్‌కౌంటర్‌లో హతమయినట్లు వస్తున్న వార్తలను సీపీ ఖండించారు. అతనిపై నిజామాబాద్ జిల్లాలో 40 కేసులున్నాయి.