చెన్నై సచివాలయం ఎదుట హెడ్ కానిస్టేబుల్ ఏ. కోదండపాణి తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగాడు. గురువారం, తన 11 ఏళ్ల కుమార్తెతో
కలిసి సచివాలయానికి చేరుకున్న ఆయన, డీఎంకే పార్టీ జెండాను దహనం చేశాడు. 2021లో జ
రిగిన ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమార్తె ఎడమ కాలును తొలగి
ంచాల్సి వచ్చిందని, మరో కాలు, ఎడమ చేయి కదలికలు కూడా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. డీఎంకే జెండాను దహనం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.