బాలుడిని చితకబాదిన కానిస్టేబుల్.. పరిస్థితి విషమం

30922చూసినవారు
బాలుడిని చితకబాదిన కానిస్టేబుల్.. పరిస్థితి విషమం
AP: కాకినాడ జిల్లా సామర్లకోటలో క్రాకర్స్ విషయంలో కానిస్టేబుల్ సతీష్ ఒక మైనర్ బాలుడిని అత్యంత దారుణంగా చితకబాదాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :