AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దేవస్థానం నుంచి ఖమ్మం వెళ్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంపై నాగులవంచలో కొందరు దాడిచేసి గాయపర్చారు. ద్విచక్ర వాహనాన్ని అధిగమించిన తర్వాత వెంబడించి, అసభ్య పదజాలంతో దుర్భాషలాడి, కారును అడ్డుపెట్టి కొట్టారు. ఈ దాడిలో కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఒక మహిళ మెడలో ఉన్న నల్లపూసల గొలుసు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.