TG: ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సుబేదారి ప్రాంతం రెవెన్యూ కాలనీ నాగేంద్రనగర్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బిర్రు అనిల్ భార్య శిరీష(36) ఇంటి సెల్లార్‌లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. హెడ్‌క్వార్టర్స్ ఫింగర్‌ప్రింట్ విభాగంలో పనిచేస్తున్న అనిల్‌తో ఆమెకు 2014లో వివాహమైంది. ఆర్థిక ఇబ్బందులు, దంపతుల మధ్య కలహాలే కారణమని తెలుస్తోంది. తండ్రి వెంకన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.