నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి వేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రయాణికుడిని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు. ప్లాట్‌ఫామ్ నంబర్ 4 నుంచి హౌరా ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ కదులుతుండగా, ఒక ప్రయాణికుడు వేగంగా ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి కింద పడబోయాడు. వెంటనే స్పందించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అతడిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగి ప్రాణాలు రక్షించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించిన కానిస్టేబుల్‌ను అధికారులు అభినందించారు.