Top 10 viral news 🔥

సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పంచదార ధర
దేశంలోని సామాన్యులకు పంచదార ధరలు షాక్ ఇవ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 15 లక్షల టన్నుల పంచదార ఎగుమతికి అనుమతి ఇచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లో నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది. సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో పంచదార ధరలు కూడా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. పంచదార నిత్యవసర వస్తువుగా ఉండటంతో వినియోగం తగ్గే అవకాశం లేదు. కాబట్టి ధరలు మరింత పెరిగుతాయని, అవసరమైనంత పంచదారను ముందుగానే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.




