
కన్నకొడుకును నేలకేసి కొట్టి, వేడి పెనంపై చేతులు కాల్చిన తండ్రి!
మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్‌లో కన్నప్రేమను మరిచి ఓ తండ్రి తన రెండేళ్ల కొడుకుపై పైశాచికంగా ప్రవర్తించాడు. బాలుడు తన వద్దకు రావడం లేదనే కోపంతో నేలకేసి కొట్టి, చేతిని వేడి పెనంపై అదిమి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డువచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. సెప్టెంబర్ 13 రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలు రోహిణి ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్, జువైనల్ జస్టిస్ చట్టాల కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.




