నడిరోడ్డుపై తగులబడిన కంటెయినర్‌.. డ్రైవర్‌ సజీవ దహనం (వీడియో)

15574చూసినవారు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లా దుంగార్‌పూర్‌ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై రవాస్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కంటెయినర్‌ నడిరోడ్డుపై డైరెక్షన్‌ బోర్డును ఢీకొని తగులబడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో కంటెయినర్‌ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. నాన్‌-వెజ్ ఫుడ్‌ ఐటమ్స్‌ లోడుతో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న కంటెయినర్‌, సూచిక బోర్డును ఢీకొనడంతో అది రోడ్డుపై కూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో డ్రైవర్‌కు తప్పించుకునే అవకాశం లభించలేదు.

సంబంధిత పోస్ట్