బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

14చూసినవారు
బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి
యూపీలోని మధుర జిల్లా సురీర్ పీఎస్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా .. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో వచ్చిన కంటైనర్ ట్రక్కు, నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సును, అక్కడే నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు, SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్