కారును ఢీ కొట్టిన కంటైనర్లు.. 5 మంది మృతి!

63చూసినవారు
పుణే-బెంగళూరు హైవేలోని నవాలే బ్రిడ్జిపై రెండు కంటైనర్లు, ఒక కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక కంటైనర్ అగ్నికి ఆహుతైంది, అందులో కారు ఇరుక్కుపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 5 మంది మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్