KLSR కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలి: కేటీఆర్

9చూసినవారు
TG: వెంటనే KLSR కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాడ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా నిలిపివేయాలన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశించిన విచారణ పూర్తయ్యే దాక ఈ కంపెనీకి ఇంకో వర్క్ ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అన్నిటికన్నా మించి KLSR ఫ్రాడ్ మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI, SFIO లేదా ED ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్