
టూరిస్టు స్పాట్లో యువతిపై దాడి.. బిహార్లో మరో వేధింపుల ఘటన
బిహార్లో బాలికలపై వరుస వేధింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, బంకా జిల్లాలోని మందర్ హిల్ వద్ద ఓ అమ్మాయిపై ఆరుగురు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారు. సెప్టెంబరు 3న జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల జాముయి, సమస్తీపుర్ జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ వరుస సంఘటనలతో రాష్ట్రంలో బాలికల భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.




