మునగాకుతో గుండె జబ్బులకు, షుగర్‌కు చెక్!

5835చూసినవారు
మునగాకుతో గుండె జబ్బులకు, షుగర్‌కు చెక్!
మునగాకు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించి, రక్తంలో చక్కెరను కణాల్లోకి వేగంగా చేరేలా చేస్తుంది. మునగాకులోని యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారించి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రోజుకు 14 గ్రాముల మునగాకు పొడిని ఒక నెలపాటు వాడితే LDL కొలెస్ట్రాల్ 30 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని పుల్కా పిండిలో, జ్యూస్‌లలో, కారప్పొడిలో లేదా కూరలలో కలుపుకుని తీసుకోవచ్చు. నిత్యం మునగాకు తీసుకోవడం వల్ల కుటుంబమంతా గుండె జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్