
వాటర్ ట్యాంక్ పై యువతి భరతనాట్యం.. వైరల్ !
వాటర్ ట్యాంక్ పై ఓ యువతి ప్రదర్శించిన భరతనాట్యం ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆకాశాన్ని వేదికగా చేసుకుని, సూర్యరశ్మిలో ఆమె చేసిన నృత్యం ఒక అద్భుత దృశ్యకావ్యంలా కనిపిస్తోంది. కెమెరామెన్ సృజనాత్మకతతో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'ఇది కదా అసలైన కళ' అంటూ నెటిజన్లు ఆమె ప్రతిభను కొనియాడుతున్నారు.




